మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌సల్మాన్, నిత్యామీనన్‌లు జంటగా రూపొందిన ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు ‘ఓకే బంగారం’ పేరుతో అనువాదం చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం అనువాద హక్కులను దిల్‌రాజు కేవలం 4కోట్లకే దక్కించుకున్నాడట. ఇక డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చులు కూడా కలుపుకున్నప్పటికీ ఈ చిత్రం బడ్జెట్ 5కోట్లు దాటదు. మణిరత్నం, రహ్మాన్, పి.సి.శ్రీరాం వంటి దిగ్గజాలు వర్క్ చేస్తున్న ఈ చిత్రాన్ని మణిరత్నం ఎంతో కసితో తెరకెక్కిస్తున్నాడు. దాంతోపాటు ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియోలకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ‘మణి ఈజ్ కమింగ్ బ్యాక్’ అని అందరూ ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. సినిమాకు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా చాలు... కేవలం శాటిలైట్ రైట్సే మూడు కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా బాగుంటే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరీ ముఖ్యంగా ‘ఎ’ క్లాస్ సెంటర్స్, మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అండదండలు ఎలాగూ ఉంటాయి. కాబట్టి మొత్తానికి దిల్‌రాజు వాలకం చూస్తుంటే జాక్‌పాట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్‌వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.