Advertisement
Google Ads BL

మణిరత్నం సినిమాపై పి.సి. శ్రీరామ్ అసంతృప్తి!


మణిరత్నం చాలాకాలం తర్వాత తన ఫామ్‌ను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ‘ఓకే కన్మణి’ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఆయన ఓ అందమైన ప్రేమకథను ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. దుల్కర్‌సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి.శ్రీరామ్‌ పనిచేశాడు. ఈ నెల 17న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషలతోపాటు తెలుగులోకి డబ్బింగ్‌ చేసి విడుదల చేయడానికి దిల్‌రాజు సంసిద్దం అవుతున్నాడు. కానీ ఈ చిత్రానికి తమిళంలో సెన్సార్‌బోర్డ్‌ ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీనిపై పి.సి.శ్రీరామ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇంతటి హృద్యమైన.. ఎంతో అందమైన ప్రేమకథకు క్లీన్‌ యు ఇవ్వకుండా, యు/ఎ ఇవ్వడం ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కానీ కోలీవుడ్‌ సమాచారం ప్రకారం ఈ చిత్రం సహజీవనం అనే పాయింట్‌ ఆధారంగా తెరకెక్కుతోందని, అందుకే సెన్సార్‌బోర్డ్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs