అల్లుఅర్జున్ త్వరలో తమ గీతాఆర్ట్స్ బేనర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఈనెలాఖరులో గానీ, లేదా మే మొదటివారంలోగానీ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందని సమాచారం. మొదటి హీరోయిన్‌గా సమంత లేదా సాయేషాసైగల్ నటించనున్నారని తెలుస్తోంది. అయితే సమంతను ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వెంటనే మరో సినిమాలో ఆమెతో చేయడానికి బన్నీ ఇష్టపడటం లేదట...!
కాగా ఈ చిత్రంలోని రెండో హీరోయిన్ పాత్రకు సోనారిక అనే హీరోయిన్‌ను పరిశీలిస్తున్నారు. ఆమె దాదాపు ఖాయమైనట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈమె ప్రస్తుతం నాగశౌర్య సరసన ‘జాదూగాడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి మహారాష్ట్రకు చెందిన ఈమె ఓ టీవీ నటి. మొత్తానికి ఆమెకు బన్నీ సినిమాలో అవకాశం వస్తే మాత్రం ఆ అమ్మాయి దశ తిరిగినట్లే అంటున్నారు.