"కథేంటో చెప్పు, ఇతర హీరోల పేర్లు చెప్పి బుట్టలో వేయకు." "వీళ్ళు స్టొరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, సినిమా తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు." ఈ డైలాగులు వింటే అర్ధం కావడం లేదూ, దర్శకులపై ఎ రేంజ్లో సెటైర్లు పడ్డాయో..! బ్రాహ్మి 'బుల్లెట్ బాబు' పాత్ర ద్వారా హీరోలపై కూడా బాగానే సెటైర్లు వేశారట. పబ్లిక్ ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ సమయాల్లో హీరోలు ఎలా బిహేవ్ చేస్తారు..? అనే అంశాన్ని కామెడీగా చూపించారు. రెగ్యులర్ సినిమాల్లో చేసినట్టు కాకుండా 'దోచేయ్'లో మంచి పాత్ర చేశాను. కామెడీలో కొత్తదనం ఉంటుందని బ్రహ్మానందం చెప్తున్నారు. సినిమా విజయం సాదిస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు.