ఎప్పటినుండో సినీ ప్రియులను అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చిత్రం ‘గబ్బర్‌సింగ్2’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు ముహూర్తం ఖరారైందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాన్ మిత్రుడు శరత్‌మరార్ తన నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎరోస్ ఇంటర్నేషనల్స్ సంస్థ భాగస్వామ్యంతో తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని మే4వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో అనీషాఆంబ్రోస్‌తో పాటు మరో హీరోయిన్ నటించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కిస్తే ఎక్కడా గ్యాప్ రాకుండా సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాబి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, లొకేషన్ల ఎంపికతో సహా దాదాపు అన్ని పనులు ఓ కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తైనా నిజం రూపం దాలిస్తే మెగాభిమానుల ఆనందానికి హద్దే ఉండదని చెప్పవచ్చు.