త్రివిక్రమ్ శ్ర్రీనివాస్, అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'. ఇటీవల విడుదలయిన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించారు. అయితే ఈ మీట్ లో కమెడియన్ అలీ హీరోయిన్ సమంత పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సమంత నడుమును కామెంట్ చేస్తూ తన నాభి భాగాన్ని విజయవాడ బెంజి సర్కిల్ తో పోల్చాడు. అంతేకాకుండా తన నాభి భాగాన్ని చూపిస్తూ ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఈ కార్యక్రమంలో సమంత ఉంటే ఎలా స్పందించేదో కానీ ఆమె ఫాన్స్ మాత్రం అలీ పై చాలా కోపంగా ఉన్నారట. కమెడియన్ గా మంచి స్థాయిలో ఉన్న అలీ ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని పలువురు భావిస్తున్నారు. కానీ అలీ కి ఆడియో ఫంక్షన్లలో బూతులు మాట్లాడడం కొత్తేమి కాదని మరికొందరు అంటున్నారు.