రవిబాబు సినిమాల కథానాయికగా పేరుపొందిన పూర్ణ నటించిన ‘అవును-2’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళంలో పలు చిత్రాలతో బిజీగా వున్న ఈ భామ ఇటీవల మహేష్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో ఓ ప్రత్యేకగీతంలో నర్తించింది. ఇదిలా వుండగా పూర్ణ ప్రస్తుతం తెలుగులో ‘రాజు గారి గది’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె యువరాణి పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకు బుల్లితెర షో ‘ఆట’ యాంకర్‌గా పేరుపొంది ‘జీనియస్’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఓంకార్ దర్శకుడు. ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో వైవిధ్యంగా వుండబోతుందని చెబుతోంది పూర్ణ.