ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'సైజ్ జీరో'. ఆర్య హీరోగా నటిస్తున్నారు. ఈ హాస్యభరిత ప్రేమకథా చిత్రంలో మరో కథానాయిక ఉందట. మొదట ఈ పాత్రలో ఈషా గుప్తా నటిస్తుందని వార్తలు వచ్చాయి. చివరకు ఆ పాత్ర సోనాల్ చౌహాన్ ను వరించిందట. పాత్ర పరిధి తక్కువైనా కథలో కీలకమైన పాత్ర కావడంతో సోనాల్ అంగీకరించింది. వచ్చే వారం నుండి ఆమె షూటింగులో పోల్గొంటుంది. అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'లెజెండ్'తో హిట్ కొట్టిన తర్వాత రామ్ సరసన 'పండగ చేస్కో'లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది సోనాల్ చౌహాన్. ఇప్పుడు అనుష్క 'సైజ్ జీరో'లో కూడా సెకండ్ హీరోయిన్ పాత్ర రావడం విశేషం. భవిష్యత్లో అలాంటి పాత్రలే వస్తాయేమో ఆలోచించుకుంటే బెటర్.