Advertisement
Google Ads BL

నితిన్‌ సినిమా రీషూట్‌...!


నితిన్‌ హీరోగా చాలాకాలం కిందట గౌతమ్‌మీనన్‌ నిర్మాణంలో ప్రారంభమైన చిత్రం ‘కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌’. షూటింగ్‌ పూర్తయినప్పటికీ ఈ చిత్రం విడుదల ఎందువల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. నితిన్‌ కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని సమాచారం. కాగా ఈ చిత్రం రషెష్‌ను ఇటీవల నితిన్‌ , ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డిలు గౌతమ్‌మీనన్‌తో కలిసి చూశారని సమాచారం. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ మరి నాసిరకంగా ఉండటంతో వాటిని రీషూట్‌ చేస్తే బాగుంటుందని నితిన్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడట. దీనికి గౌతమ్‌మీనన్‌ కూడా అంగీకరించడంతో ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను రీషూట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొరియర్‌ సరైన సమయంలో కాకుండా ఆలస్యంగా డెలివరీ చేయడానికి బాధ్యత ‘కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌’దా? లేక ఈ కొరియర్‌బోయ్‌కు ఉద్యోగం ఇచ్చిన నిర్మాత గౌతమ్‌మీనన్‌దా?అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs