Advertisement
Google Ads BL

నన్నేందుకు రచ్చకీడుస్తున్నారు అంటున్న హీరో...!


తమిళ హీరో కార్తి నటించిన ‘కొంబన్‌’లో రెండు వర్గాల మధ్య ఘర్షణకు తావిచ్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అన్ని సమస్యలను దాటుకొని ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. చాలామంది చేసిన ఆరోపణలకు దూరంగా ఈ చిత్రం ఉందని, ఎవ్వరినీ రెచ్చగొట్టే సన్నివేశాలు లేవని తేలిపోయింది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో తమిళ యంగ్‌ హీరో ఉదయనిధి పాత్ర కూడా ఉందని కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఉదయనిధి నటించిన ‘నన్బేండా’ సినిమాకు థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కలేదనే కారణంగానే ఇలా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఉదయనిధి మాట్లాడుతూ... ‘నన్బెండ’ విడుదల తేదీని నెల కిందటే ప్రకటించాం. ఆ తర్వాతే ‘కొంబన్‌’ విడుదల తేదీని ప్రకటించారు. నా సినిమాను రాష్ట్రంలో దాదాపు 275 థియేటర్లలో విడుదలకు ఒప్పందం కుదిరింది. ఆ థియేటర్లలో ఎలాంటి మార్పు  లేదు. ‘కొంబన్‌’ సినిమా ఎన్ని థియేటర్లలో వచ్చినా మా సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సమస్యలోకి ఎందుకు నన్ను లాగుతున్నారో అర్థంకావడం లేదు.‘కొంబన్‌’నను అడ్డుకోవాల్సిన అవసరం నాకు లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs