‘జోష్’ ఫేమ్ వాసువర్మ దర్శకత్వంలో నిర్మాత దిల్‌రాజు సునీల్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మల చేతిలో చిక్కిన హీరోగా సునీల్ తన స్టైల్ ఆఫ్ కామెడీని మెయిన్‌టెయిన్ చేస్తున్నాడట. కాగా ఈ చిత్రంలో కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన నిక్కి తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఇక మరో హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘తుంగభద్ర’ హీరోయిన్ డిరపుల్ నటిస్తోంది. మొత్తానికి ఇంతకాలానికి మరలా మేకప్ వేసుకొని బిజీ అవుతున్న సునీల్‌కు ఈసారైనా సరైన విజయాలు వస్తాయో? లేదో? వేచి చూడాల్సివుంది.