మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా మైత్రి సంస్థ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మహేష్ పుట్టుకతోనే ధనవంతుడిగా, ప్లే బోయ్ పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీని దాటి బయటకి వెళ్ళని వాడు కొన్ని పరిస్థితులలో ఓ గ్రామానికి వెళ్తాడు. అక్కడ ప్రజలంతా పరిస్థితులు బాగోలేవని ఊరు వదిలి వెళ్ళిపోతున్న సమయంలో మహేష్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని పరిస్థితులను మెరుగు పరుస్తాడని సమాచారం. ఈ సినిమా ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ నేపధ్యంలో సాగనుందట. మరి ఈ విషయాలు ఎంత వరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచిచూడాలి.