Advertisement
Google Ads BL

ఒకరోజు ముందే రానున్న బాలయ్య....!


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా త్రిష, రాధికాఆప్టే హీరోయిన్లుగా బాలయ్య సిబిఐ ఆఫీసర్‌గా, మాస్‌లుక్‌తో రెండు పాత్రలు చేస్తోన్న చిత్రం ‘లయన్‌’. ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నాడు. కాగా మొదట ఈ చిత్రాన్ని మేడే రోజున అంటే మే1న విడుదల చేయాలని భావించారు. అయితే నాలుగురోజుల లాంగ్‌ వీకెండ్‌ కోసం ప్రయత్నిస్తూ దానికి అనుగుణంగా ఒక రోజు ముందే అంటే ఏప్రిల్‌ 30వతేదీనే ఈ సినిమాను థియేటర్లలోకి తేనున్నారని సమాచారం. కాగా ఈ చిత్రం ఆడియో ఏప్రిల్‌ 9వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ మధ్య మ్యూజిక్‌ డైరెక్టర్ల రేసులో వెనుకపడ్డ సీనియర్‌ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. వాస్తవానికి గతంలో బాలయ్య`మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో 90శాతంకు పైగా భారీ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచాయి. మరి ఈ చిత్రం కూడా సక్సెస్‌ అయితే  మరలా మణిశర్మ ఊపు పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs