Advertisement
Google Ads BL

త్రివిక్రమ్‌ స్టైలే అంత...!


త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ ‘అత్తారింటికిదారేది’ చిత్రం రూట్‌లోనే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ నడుస్తుందని సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు ఒక భారీ యాక్షన్‌ సీన్‌.. ఆ తర్వాత రైల్వేస్టేషన్‌లో తన డైలాగ్‌లతో అత్త మనసును కరిగించే పవన్‌ మాటలు ఈ చిత్రానికి మంచి బూస్టప్‌ ఇచ్చాయి. తాజాగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో కూడా అల్లుఅర్జున్‌ చేత క్లైమాక్స్‌లో కళ్లు చెమర్చే విధంగా.. హృదయాలను మెలిపెట్టే రీతిలో సెంటిమెంట్‌ పండిరచాడని సమాచారం. ఇక ఈ సినిమా మొత్తం మీద సెకండాఫ్‌లో ఒక అరగంట బోరింగ్‌గా ఉంటుందని సమాచారం. అది కూడా ‘అత్తారింటికిదారేది’ చిత్రంలో బ్రహ్మానందం, అహల్యల ఎపిసోడ్‌లాగా బోర్‌ కొట్టించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో పంచ్‌ డైలాగులను పక్కనపెట్టి వన్‌లైనర్స్‌తో, గుండెల్ని తాకే మాటలతో త్రివిక్రమ్‌ మెస్మరైజ్‌ చేశాడని చెబుతున్నారు. మరి సినిమా ఫలితం చూడాలంటే ఈ నెల 9వ తేదీ వరకు వెయిట్‌ చేయాల్సిందే. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs