అదరగొడుతోన్న సత్యమూర్తి కొడుకు...!
ఈరోజుల్లో స్టార్లతో సినిమా అయినా సరే... నిర్మాతకు చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమా కొనేవాడు లేడు. కొన్నా డబ్బులు తిరిగి వస్తాయనే గ్యారంటీ లేదు. మొత్తం ఒక జూదంగా మారిపోయింది. ఈకాలంలో ఓ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కించుకుంది అంటే సినిమా సూపర్‌హిట్ అయినంత సంబరం. ఇప్పుడు ‘సన్నాఫ్‌సత్యమూర్తి’ నిర్మాత రాధాకృష్ణ కూడా అంతే సంతోషంగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్`అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఏప్రిల్9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా హక్కులన్నీ అమ్ముడుపోయాయి. అన్ని ఏరియాలను ఫ్యాన్సీరేటుకు అమ్మేశారు. మొత్తంగా ఈ చిత్రం విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోంది. దాదాపు 15కోట్లు లాభాలొచ్చాయని తెలుస్తోంది. సినిమా సూపర్‌హిట్టు అయితే ఆ లాభాల్లో కూడా మళ్లీ వాటా దక్కుతుంది. ఈమధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్న సినిమా ఏదీ లేదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads