‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత మూడునెలలుగా మేకప్ వేసుకోని పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్‌సింగ్2’ చిత్రం అసలు ఉంటుందా? లేక ఆగిపోనుందా? అనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కానీ పవన్ సన్నిహితులు మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ‘గోపాల గోపాల’లో పవన్ చెప్పినట్లు రావడం కాస్త లేటవ్వవచ్చేమో గానీ...రావడం మాత్రం పక్కా... అనే డైలాగ్‌ను వారు వినిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలోగానీ లేదా మే 1వ తేదీన కానీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ చిత్రానికి పవన్ మే చివరి వారం నుండి డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘పవర్’ ఫేమ్ బాబి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం 70కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రం ప్రారంభమైన తర్వాతే ఆయన మిగతా ప్రాజెక్ట్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తాడని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త మెగాభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే మరి...!