సక్సెస్‌ల్లో ఉన్నప్పుడు, డిమాండ్ ఆటోమేటిగ్గావస్తుంది. అదే తడవుగా వచ్చిన అన్ని సినిమాలను ఒప్పుకొని చివరకు వచ్చేసరికి డేట్స్ సమస్యలు వచ్చి, డేట్స్ సర్దుబాటు చేయలేక నిర్మాతలను, హీరోలను, దర్శకులను ఇబ్బందుల గురిచేయడం ఈనాటి హీరోయిన్లకు అలవాటైపోయింది. ఇటీవల ఇదే విషయమై శృతిహాసన్‌కు, పివిపికి మధ్య గొడవ వచ్చి విషయం కోర్టుదాకా వెళ్లింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కూడా ఇదే సమస్య ఎదురవుతోందని సమాచారం. ఆమె రామ్‌చరణ్`శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. అదే సమయంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్`సుకుమార్`బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రాన్ని కూడా ఒప్పుకొంది. అయితే ఈ రెండు చిత్రాలు దాదాపు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ఇందులో రకుల్ తప్పుతో పాటు నిర్మాత, దర్శకుల తప్పు కూడా ఉంది. అనుకున్న సమయానికి సినిమాను ప్రారంభించక లేటవ్వడం కూడా ఇందుకు కారణం. దీంతో రకుల్ ఎన్టీఆర్`సుకుమార్‌ల చిత్రం నుండి వైదొలగనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం రాద్దాంతం కాకుండా రకుల్ చాలా బాగా రియాక్ట్ అయి తన ఇబ్బందిని దర్శకనిర్మాతలకు తెలియజేయడంతో ఈ ఇష్యూ అక్కడితో పరిసమాప్తమైందని తెలుస్తోంది.
Advertisement
CJ Advs