ఇటీవల గోపీచంద్ హీరోగా యు.వి.క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణకుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందిన ‘జిల్’ చిత్రం విడుదలైంది. సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా సో..సో..గా ఉన్నాయి.ఈ సినిమాలో
ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడమే పెద్దమైనస్ అని అందరూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉండటంతో ఈ లోపంపై ప్రస్తుతం యూనిట్ దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈ చిత్రంలో కామెడీ కూడా ఉందిట. కథ టెంపోకి అడ్డొస్తుందనే ఆలోచనతో దానిని ఎడిటింగ్‌లో లేపేశారని సమాచారం.ఈ చిత్రంలో బ్రహ్మానందంపై ఓ సపరేట్ కామెడీ ట్రాక్ కూడా ఉందని, దాన్ని కూడా పక్కనపెట్టారని తెలుస్తోంది. కామెడీ మిస్ అయింది అనే టాక్ రావడంతో యూనిట్ ఆఘమేఘాల మీద ఈ ట్రాక్‌ను మరలా సినిమాకు కలపనున్నారని సమాచారం.
Advertisement
CJ Advs