రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రలు పోషిస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. కాగా ఈ చిత్రంలో తాను కీలకపాత్ర పోషించడం చాలా ఆనందంంగా ఉందని తమన్నా సంతోషపడుతోంది. తనకు అవకాశం ఇచ్చిన రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతోంది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె చెబుతూ... నేను కూడా కత్తి పట్టి పోరాటాలు చేశాను. ఈ విషయంలో రాజమౌళి గారు దిశానిర్దేశం చేశారు. ‘బాహుబలి’ మొదటి భాగంలో నేను పూర్తిస్థాయిలో కనిపిస్తాను. రెండో భాగంలో నా పాత్ర పరిధి చాలా తక్కువగా ఉంటుందని తమన్నా తెలిపింది.