Advertisement
Google Ads BL

సత్యమూర్తి కొడుకుని అందరూ చూడొచ్చు!


‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ రూపొందించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సోమవారం(30) సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌తో అందరూ చూసే చిత్రంగా గుర్తింపుని వేయించుకుంది. అంతేకాదు, ఈ చిత్రం చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి గురించి అద్భుతంగా చెప్పడం విశేషం. ముఖ్యంగా నిత్యామీనన్‌కి ఈ చిత్రం మరో అవార్డ్‌ని తెచ్చిపెడుతుందని అంటున్నారు. అంతలా ఈ చిత్రంలో ఆమె నటన ఉంటుందని సెన్సార్‌ సభ్యులు బయటపెట్టారు. సెన్సార్‌ సభ్యుల నుండి ఇంతటి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో.., ఈ సినిమా మరో అత్తారింటికి దారేదిగా బాక్సాఫీస్‌ వద్ద నిలబడుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs