Advertisement
Google Ads BL

మరలా నయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా..!


తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ నటన పరంగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. అయితే స్టార్ హీరోయిన్ వెలుగొందిన ఈ భామ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. మొదట్లో హీరో శింబు ను ప్రేమించి వివాదంలో చిక్కుకొంది. కానీ ఆ ప్రేమ బెడిసి కొట్టింది. కొన్నాళ్ళకు ప్రభుదేవా ను ప్రేమించింది. వీరిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వచ్చినా కొన్ని విషయాల కారణంగా పెళ్లి మాత్రం జరగలేదు. ఆ సమయంలో నయనతార తీవ్రంగా కుంగిపోయింది. ఓ ఇంటర్వ్యూ లో శింబును క్షమిస్తాను కానీ ప్రభుదేవా ను అసలు క్షమించలేను అని చెప్పింది. దీంతో నయనకు ప్రభుదేవా మీద ఎంత కోపం ఉందో తెలుస్తోంది. రీసెంట్ గా ప్రభుదేవా మళ్ళీ నయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడట. ఓ ప్రముఖ తెలుగు నిర్మాతతో నయనతారకు రాయభారం పంపించాడట. కానీ నయన ఎట్టి పరిస్థితిలోను అది జరగదని, నా జీవితం నాశనం చేసుకోలేని తెగేసి చెప్పేసిందట. నిర్మాత మాత్రం వారిద్దరినీ కలపడానికి కాదని, వాళ్ళతో ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నంగా నయనను కలిసాడని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs