Advertisement
Google Ads BL

కోన వెంకట్, దానయ్యలను కత్తితో బెదిరించారు!


రచయిత కోన వెంకట్, ప్రముఖ నిర్మాత డివివి దానయ్యలకు గత రాత్రి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రకాష్ రాజ్ ఫాం హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీ నుండి తిరిగోస్తుండగా కొందరు దుండగులు కత్తితో బెదిరించి వీరిని దోచుకున్నారు. షాద్ నగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మొదట చెట్టుని నరికి రోడ్డుకు అడ్డంగా పడేసిన దుండగులు, కారు ఆగిన తర్వాత గొడ్డలితో డ్రైవర్ విండోను పగులగొట్టారు. ఆ తర్వాత పెద్ద కత్తిని మెడపై పెట్టి బెదిరించి వీరి వద్దనున్న వస్తువులు, డబ్బులు అన్నిటిని దోచుకుని వీరిని వదిలిపెట్టారు. ప్రాణాలకు ఎటువంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై కోన వెంకట్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

గతంలో షాద్ నగర్ - కేసం పెట్ రోడ్డులో ఇటువంటి ఘటనలు జరిగాయని కోన వెంకట్ తెలిపారు. అప్పుడు పోలీసులు దుండగులను పట్టుకోలేకపోయారు. కొత్త రాష్ట్రం క్రైమ్ జోన్ కాకూడదని కోరుకుంటున్నాను. ఈ నగరానికి ఏమైంది. ఈ దారిలో వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్, డేంజరస్ రోబర్స్ గ్యాంగ్ ఉంది. అని ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తన ఆవేదనను చెప్పుకున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs