వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. కానీ కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రుతి ఆ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పిక్చర్ హౌస్ మీడియా అధినేతలు ఆమెపై కేసు కూడా నమోదు చేసారు. ఈ కేసు ముగిసే వరకు శ్రుతి వేరే సినిమాలను అంగీకరించకూడదని కోర్టు నుండి ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. అయితే శ్రుతిహాసన్ మాత్రం "పూనేలో జరుగుతున్న 'యారా' సినిమా షూటింగ్ ఫెంటాస్టిక్ గా జరుగుతుంది. నా లైఫ్ లోనే బెస్ట్ టైం, చాలా నేర్చుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేసింది. దీంతో శ్రుతిపై టాలీవుడ్ లో పెట్టిన కేసును ఆమె చాలా తేలికగా తీసుకుంటునట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు విషయాలపై శ్రుతి ఎలా స్పందిస్తుందో చూడాలి..!