మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి వారసుడిగా కొండంత బాధ్యత.. అంతకు మించిన అభిమానుల అండతో 2007లో సినీరంగ ప్రవేశం చేశారు. చరణ్ తొలి సినిమా చిరుత సెప్టెంబర్ 27న విడుదలయ్యింది. ఆ లెక్కన ఇండస్ట్రీలో రామ్ చరణ్ జరుపుకుంటున్న 8వ పుట్టినరోజు ఇది. హీరోగా 8 ఏళ్ళు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
హీరోగా రామ్ చరణ్ చేసింది కేవలం 8 సినిమాలు మాత్రమే. అయితేనేం, మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోలలో చరణ్ ఒకరు. రెండవ సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన ఘనత చరణ్ సొంతం. 40 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాల్లో అత్యధికం అతనివే. చరణ్ నటించిన 5 సినిమాలు.. మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలేలు 40 కోట్లు కలెక్ట్ చేశాయి. మాస్ హీరోగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి రామ్ చరణ్ బోల్తా కొట్టారు. ఆరెంజ్, జంజీర్(తెలుగులో తుఫాన్) సినిమాలు పరాజయం పాలయ్యాయి. మాస్ ఇమేజ్ నుండి కాస్త బయటకు వచ్చి చేసిన గోవిందుడు అందరివాడేలే పాస్ మార్కులు వేయించుకుంది. ఇప్పుడు చరణ్ కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కామెడీ టైమింగ్ మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాడు. మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించాలని, ప్రేక్షకులను ఇలానే అలరిస్తూ.. ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే టు రామ్ చరణ్.