వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఓటమితో టీం ఇండియా, యావత్ భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆసీస్ చేతిలో ఇండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కరికి మాత్రం ఈ ఓటమి సంతోషాన్ని కలిగించింది. అతనెవరో కాదు, యువ హీరో నాని. 'ఎవడే సుబ్రమణ్యం' సక్సెస్ మీట్ కార్యక్రమంలో... అందరు తిట్టుకున్నా సారీ. టీం ఇండియాకు థాంక్స్. రేపటి నుండి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అని సరదాగా వ్యాఖ్యానించారు.
సరదాగా మాట్లాడినా నాని వ్యాఖ్యలలో నిజం ఉంది. వరల్డ్ కప్ సందర్భంగా థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి తక్కువైంది, పలు చిత్రాల వసూళ్ళకు గండి పడింది. వాటిలో నాని నటించిన రెండు చిత్రాలు 'ఎవడే సుబ్రమణ్యం', 'జెండాపై కపిరాజు' చిత్రాలు ఉన్నాయి. ఇండియా ఇంటికి వచ్చేస్తుండడంతో మనోళ్ళు క్రికెట్ పై పెద్దగా ఆసక్తి చూపించారు. కొత్త చిత్రాలకు ఇది అనందం కలిగించే విషయం.