Advertisement
Google Ads BL

‘రుద్రమదేవి’ కష్టమే అంటున్నారు!


ఏ ముహూర్తాన గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ని ప్రారంభించాడో గానీ ఈ చిత్రానికి ఏకంగా 70కోట్ల బడ్జెట్‌ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ రేంజ్‌లో ఈ చిత్రం బిజినెస్‌ మాత్రం జరగడం లేదని సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలయ్యేది కష్టమే అనే అభిప్రాయాన్ని ట్రేడ్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదల కాకపోతే వరుసగా పెద్ద పెద్ద చిత్రాలు పోటీలో ఉన్నాయి. మేలో ‘బాహుబలి’తో పాటు జులై 17న మహేష్‌బాబు చిత్రం ‘శ్రీమంతుడు’ వరకు క్యూలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘రుద్రమదేవి’ ఏప్రిల్‌ 23న విడుదల కాకపోతే ఇక ఆగష్టు వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితేగియితే ఈ చిత్రం ‘బాహుబలి’ కంటే ముందు విడుదల కావడమే మేలు అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటికీ పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ లేటవుతోందని, ఇళయరాజా ఈ చిత్రంలోని కొంత పార్ట్‌ 
రీరికార్డింగ్‌ను లండన్‌లో చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs