గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో 70కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో అనుష్క, అల్లుఅర్జున్, నిత్యామీనన్, కృష్ణంరాజు వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే ఆడియో కూడా విడుదలయింది. ఇక కొంచెం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ మిగిలివుంది. సమ్మర్‌లో రిలీజ్ చేయాలని గుణశేఖర్ నిర్ణయించడంతో ఈ చిత్రానికి భారీపోటీ తప్పేలా లేదు. మే 15న ‘బాహుబలి’, మే 1న ‘లయన్’ వచ్చేట్లు ఉన్నాయి. ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఓ వారం ఆలస్యంగా ఏప్రిల్ 2న కాక ఏప్రిల్ 9న వస్తుందని వినిపిస్తోంది. అదే జరిగితే ఏప్రిల్ 23న ‘రుద్రమదేవి’ని ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశ్యంలో గుణశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలైతే అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి’ ఒకే నెలలో విడుదలకానున్నాయి. అలాగే నిత్యామీనన్‌కు కూడా ఒకే నెలలో రెండు సినిమాలు విడుదలైన ఘనత దక్కుతుంది...!