కమల్‌హాసన్ స్వీయదర్శకత్వంలో రూపొందిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘విశ్వరూపం2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసినా ఇప్పటికీ విడుదల కాకపోవడం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. ఈ చిత్రం ఇలా లేటవ్వడానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రనే అని కమల్‌హాసన్ స్పష్టం చేశాడు. కమల్‌హాసన్ మాట్లాడుతూ... నాకు ఈ చిత్రం ఎందుకు లేటవుతుందో తెలియదు. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్ణయించుకోవాలి. అసలు ఈ చిత్రం విడుదల కాకుండా ఎందుకు ఆగుతుందో కారణం తెలుసుకోవాలి.. ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు నేను ఖాళీగా ఉండలేను కదా! అందుకే నేను ‘ఉత్తమవిలన్, పాపనాశం’ చిత్రాలు చేశాను.. ' అని తేల్చిచెప్పాడు.