Advertisement
Google Ads BL

సదా చాలా చీప్ అయిపోయింది!


‘జయం’ చిత్రంతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత అందరు స్టార్‌ హీరోల సరసన నటించిన స్టార్‌ హీరోయిన్‌ సదా... శంకర్‌`విక్రమ్‌ల ‘అపరిచితుడు’ ద్వారా మరింత బిజీ అవుతుందని అందరూ ఆశించారు.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించినప్పటికీ సదాకు అనుకున్న క్రేజ్‌రాలేదు. దీంతో ఇప్పుడు ఈమె చిన్నచిన్న క్యారెక్టర్లకు, టీవీ రియాల్టీషోలలో జడ్జిగా నటిస్తోంది. ఇటీవలే ఆమె ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల2’లో కీలకపాత్రను పోషించిన సంగతి తెలిసిందే.చాలా మంది కొత్త కొత్త హీరోయిన్స్‌ వచ్చేసరికి ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. కాగా ఈమె తాజాగా కోలీవుడ్‌లో ఓ సీనియర్‌ కమెడియన్‌ సరసన నటించేందుకు ఒప్పుకొందని సమాచారం. వడివేలు హీరోగా నటిస్తున్న హాస్య చిత్రం ‘ఎలి’లో సదా కీలకపాత్రను పోషించనుంది. వడివేలుతో చిందేయనుంది. ఈ చిత్రానికి యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వడివేలు గూఢచారిగా నవ్వించనున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs