Advertisement
Google Ads BL

వెండితెరపై మరో బుల్లితెర నటి!


‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ ద్వారా పాపులర్‌ అయిన అవికాగౌర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరుస్తోంది. చివరకు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా ఆమెకు  ఛాన్స్‌లు వస్తున్నాయి. కాగా ఇప్పుడు మరో బుల్లితెర నటి హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌ వారిని అంతగా ఆకర్షించింది సోనారిక. ఆమె ‘హరహరమహాదేవ’ సీరియల్‌లో పార్వతిగా నటిస్తోంది. కాగా ‘జాదుగాడు’ చిత్రంలో ఈ అమ్మడు యువహీరో నాగశౌర్య సరసన నటిస్తోంది. మొట్టమొదటిసారిగా నాగశౌర్య పూర్తి స్థాయి మాస్‌ హీరోగా రానున్న చిత్రం ఇది. మరి ఈ చిత్రం ద్వారా పార్వతి అలియాస్‌ సోనారిక తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాలి...! ఈ చిత్రానికి మణిశర్మ సంగీత వారసుడు మహతి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs