70కోట్ల బడ్జెట్‌తో కాకతీయ వీరనారి ‘రుద్రమదేవి’ జీవితాన్ని తొమ్మిదేళ్లు రీసెర్చి చేసి సినిమాగా తీస్తున్న దర్శకనిర్మాత గుణశేఖర్. ఆయన ఈ చిత్రంలో కేవలం రుద్రమదేవి వీరత్వాన్నే కాదు.. సామాన్య ప్రజలను రంజింపజేయడానికి ఆమెలోని రొమాంటిక్‌లుక్‌ను కూడా బయటకు తీసుకువస్తున్నాడు. ‘ఔనా.. నీవేనా...’ సాంగ్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ విషయం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సినిమా మొత్తం పోరాట సన్నివేశాలతో నింపేస్తే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారని కాబోలు మధ్యలో రిలీఫ్ కోసం ఇలాంటి రొమాంటిక్ సాంగ్‌ను కూడా జొప్పించాడు. ఈ రొమాంటిక్ మూడ్‌ను లిమిటేషన్స్‌లో ఉంచితే బాగానే ఉంటుంది కానీ... మరీ శృతిమించితే మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, చారిత్రక పరిశోధకులు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని సామాన్య ప్రేక్షకులు సైతం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.