Advertisement
Google Ads BL

ఆదిత్యరామ్‌ స్టూడియోలో ‘పులి’


సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్‌నిరంజన్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఆదిత్యరామ్‌ గ్రూప్‌ అధి నేత ఆదిత్యరామ్‌. సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గానే కాకుండా చెన్నయ్‌లో ఒక భారీ స్టూడియోను నిర్మించి స్టూడియో అధినేతగా కూడా తన సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు. ఒకవైపు బిజినెస్‌ చూసుకుంటూ మరోవైపు సినిమాలను నిర్మిస్తూనే సినిమా రంగంలో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనే తలం పుతో ఆదిత్య గ్రూప్స్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చెన్నైలోని ఉతాండి, ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లో నిర్మించిన ఈ స్టూడియో సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే వన్‌ ఆప్‌ ది బెస్ట్‌ స్టూడియోగా నిలిచింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఆదిత్యరామ్‌ స్టూడియో అధినేత ఆదిత్యరామ్‌ మాట్లాడుతూ ` ‘‘బిజినెస్‌మేన్‌ అయిన నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి. అందుకే సినిమారంగంలో ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నాలుగు మంచి సినిమాలు నిర్మించాను. సినిమారంగానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు అన్ని అధునాతన సౌకర్యాలతో ఒక స్టూడియో నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అందులో భాగంగా చెన్నయ్‌లోని ఉతాండి, ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లో ఈ భారీ స్టూడియోను నిర్మించడం జరిగింది. ఈ స్టూడియో ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఇందులో ముఖ్యంగా రెండు ఫేజ్‌లుంటాయి. మొదటి భాగంలో సాంగ్స్‌ చిత్రీకరించుకునేందుకు వీలుగా వుండే ఒక సెట్‌ వుంటుంది. మరో ఫేజ్‌లో స్ట్రీట్‌ సెట్‌, టెంపుల్‌, చర్చి, మసీద్‌ వంటి సెట్స్‌ వేసుకోవడానికి అనువుగా వుంటుంది. మా స్టూడియోలో దర్శకనిర్మాతల అవసరాల మేరకు అద్భుతమైన సెట్స్‌ను వేసే ఆర్ట్‌ డైరెక్టర్స్‌ ఉంటారు. అందుకే ఈ స్టూడియోలో నిర్మించిన ఏ సెట్‌కైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకు చాలా ఉదాహరణలు వున్నాయి. యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ తెరకెక్కించిన దశావతారం చిత్రం కోసం వేసిన హిస్టారికల్‌ పార్ట్‌ సెట్‌ సినిమాకే పెద్ద హైలైట్‌ అయింది. అలాగే ఆవారా హీరో కార్తీ, సెల్వరాఘవన్‌ కాంబినేషన్లో రూపొందిన విజువల్‌ వండర్‌ యుగానికొక్కడు చిత్రానికి సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను మా స్టూడియోలోనే చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో ఇళయదళపతి విజయ్‌ హీరోగా హన్సిక, శ్రీదేవి, శృతిహాసన్‌ కాంబినేషన్‌లో శింబుదేవన్‌ దర్శకత్వంలో ‘పులి’ చిత్రాన్ని మా స్టూడియోలోనే చిత్రీకరిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సెట్స్‌కి ఉన్న ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి అవసరానికి తగ్గట్టుగానే మా స్టూడియోలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సినిమా కోసం స్టార్టింగ్‌లో వేసిన సెట్‌ను చూసి ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సెట్‌ అని అందరూ ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటికే మా స్టూడియో అన్ని అధునాతన సౌకర్యాలతో దర్శకనిర్మాతల పాలిట స్వర్గధామంగా వుంది. భవిష్యత్తులో ఈ స్టూడియోకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తీర్చిదిద్దబోతున్నాం’’ అన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs