Advertisement
Google Ads BL

ఫైట్ మాస్టర్ కు చుక్కలు చూపిస్తోన్న మహేష్..!


కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఆగడు' సినిమా ఫ్లాప్ తరువాత మహేష్ నటించే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని ప్రతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా అనల్ అరుసు పని చేస్తున్నాడు. ఆయన డిజైన్ చేసిన ఫైట్స్ రొటీన్ గా అన్ని సినిమాలలో కనిపించే విధంగా ఉన్నాయని ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు డిఫరెంట్ గా ఉండాలని మహేష్ అంటున్నాడట. దీంతో ఎలాంటి ఫైట్స్ సీన్స్ డిజైన్ చేయాలి. మహేష్ ను ఎలా మెప్పించాలి అని ఫైట్ మాస్టర్ తెగ కంగారు పడిపోతున్నాడట. దీన్ని బట్టి మహేష్ ఈ సినిమా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs