బాలీవుడ్ యువహీరో షాహిద్‌కపూర్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వీరిమధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు బీ-టౌన్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వీరి వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రూట్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది 'హైదర'్‌తో భారీ విజయాన్ని అందుకున్న షాహిద్‌కపూర్ ఇదే ఏడాది వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కరీనాతో తన ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత బాధలో ఉన్న షాహిద్‌ను మీరా అక్కున చేర్చుకుందని, అదే వారిద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడటానికి కారణమైందని షాహిద్ సన్నిహితులు చెబుతున్నారు.