తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుల్లో అదృష్టవంతుడు ఎవరంటే అది ఖచ్చితంగా తమనే అని చెప్పాలి. శ్రీ, రాధాకృష్ణన్. కోటి, విద్యాసాగర్ వంటి వారు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రాక ఊరకుండి పోతుంటే తమన్ మాత్రం అవకాశాల మీద అవకాశాలు కొట్టేస్తున్నాడు. స్టార్‌హీరోలు కూడా ఈయనతో పనిచేయడానికి బాగా ఇష్టపడుతుండటం విశేషం. కాగా రామ్‌చరణ్`శ్రీనువైట్ల సినిమాకి అనిరుధ్‌ని తొలగించిన తర్వాత ఆ స్థానాన్ని తమన్‌తో రీప్లేస్ చేశారు.ఇక తమళంలో స్టార్‌హీరో సూర్య నటిస్తున్న ‘మాస్’ చిత్రం విషయంలోనూ ఇదే జరిగిందట. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కు సూర్యకి అభిప్రాయబేధాలు రావడంతో ఆ స్థానాన్ని సూర్య తమన్‌తో భర్తీ చేసుకున్నాడు. మరి అదృష్టం అంటే తమన్‌ది కాక ఎవరిది? అనవచ్చు.