సాధారణంగా సినిమా ఫీల్డ్‌లో నటవారసులదే హవా. మిగిలిన విభాగాల వారసులకు టాలెంట్ ఉంటే తప్ప నెగ్గుకురాలేరు. కేవలం ఎంట్రీకి మాత్రమే తల్లిదండ్రుల పేర్లు ఉపయోగపడతాయి. మిగిలినదంతా ప్రేక్షకులను ఏరీతిన ఆదరిస్తారు? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు మణిశర్మది అద్భుమైన స్థానం. కేవలం పాటలే కాదు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో ఆయనకు ఆయనే సాటి. ఇటీవల వచ్చిన ‘టెంపర్’ చిత్రంలో కూడా మణిశర్మ రీరికార్డింగ్ అదిరిపోయే లెవల్లో ఇచ్చాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోకి మణిశర్మ వారసుడు వస్తున్నాడు. అది ఏ హీరోగానో, లేదా మరోటిగానో కాకుండా ఆయన తన తండ్రిలాగానే సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. అందులో భాగంగానే మణిశర్మ కుమారుడు మహతి మ్యూజిక్ డైరెక్టర్‌గా లాంఛ్ అవుతున్నాడు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘జాదూగాడు’ చిత్రం ద్వారా మహతి సంగీత దర్శకుడు అవుతున్నాడు. మరి సంగీతంలో ఆయన తనదైన శైలిలో వెళ్లి తండ్రిలా గుర్తిండిపోయే సంగీతాన్ని అందిస్తాడో లేదో చూడాలి...!