తాజాగా తమిళస్టార్ శింబు చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. ఆయన నటించిన ‘వాలు’ చిత్రం విడుదల చాలాకాలంగా వాయిదాలు పడుతుండటంతో ఆయన పూర్తి డిప్రెషన్‌కు లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. ఆయన ట్వీట్ చేస్తూ... కొందరు నా పట్ల జలసీగా ఫీలవుతున్నారు. వారిని నేను క్షమించను. వారి తప్పులకు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఎవరి గురించి ఈ ట్వీట్ చేశానో వారికి బాగా తెలుసు... అంటూ శాపనార్ధాలు పెట్టాడు. ఇంతకీ శింబు చేసిన కామెంట్స్ ఎవరి మీదా...? అనే దానిపై కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.