తమ సినిమాల షూటింగ్ చివరిరోజు చిత్రం యూనిట్‌కు సొంత ఖర్చుతో బిర్యానీ విందు ఏర్పాటు చేయడం తమిళ హీరోలు అజిత్, విజయ్‌లకు అలవాటు. పండుగ రోజుల్లో కూడా చిత్ర బృందానికి ఇలాంటి విందునే ఆ హీరోలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ధనుష్ కూడా చేరాడు. బాలాజీమోహన్ దర్శకత్వంలో ‘మారి’ అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నాడు. జంటగా కాజల్ అగర్వాల్ ఆడిపాడుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేశారు. ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా ధనుష్ బిర్యానీ విందు ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా తనే వడ్డించాడు. విజయ్ యేసుదాస్,రోబోశంకర్, కాళి వెంకట్‌లో ఈ చిత్రంలో కీలకపాత్రల్లో
నటిస్తున్నారు.
Advertisement
CJ Advs