Advertisement
Google Ads BL

తండ్రి బాటలోనే కొడుకు..!


నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘చింతకాయల రవి' ఫేమ్‌ యోగేశ్‌ దర్శకత్వంలో వి.వి.యన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు'. ఈ చిత్రంలో హీరోయిన్ గా  ‘హర హర మహాదేవ' సీరియల్ లో పార్వతి పాత్ర ద్వారా దేశమంతటా మంచి పేరు సంపాదించుకున్న సోనారిక తెలుగు తెరకు పరిచయమవుతుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అధ్బుతమైన పాటలను అందించి  ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మణిశర్మ. ఇప్పుడు ఆయన తన కుమారుడు మహతిని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. మణిశర్మ తరహాలోనే ఆయన కుమారుడు సంగీత దర్శకునిగా పనిచేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో మహతి 5 పాటలను కంపోజ్ చేయడంతో పాటు ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా చేసాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా మహతి ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs