బన్నీ - త్రివిక్రమ శ్రీనివాస్ ‘‘సన్ ఆఫ్ సత్యమూర్తి’’ ఆడియో ఫంక్షన్‌లో దాసరి ప్రసంగం : మైకు చేతబట్టిన కోతి ఫొటో పోస్ట్‌చేసిన రామ్ చరణ్ - ఒక్కసారిగా గుప్పుమన్న వర్గపోరు!
‘అసలే కోతి, ఆ పై కల్లు తాగింది’ అన్న పాత సామెతకు ‘చేతికి మైకు దక్కింది’ అన్న కొత్త భావన జోడయింది!!
ఇదిలా వుండగా నాగబాబు అండ్ కో., ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలలో బలపరిచింది. రాజేంద్రప్రసాద్ ఎన్నిక లాంచనమే - అనుకుంటున్న తరుణంలో సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే - సహజనటి జయసుధ అనూహ్యంగా రంగప్రవేశం చేసింది. దీనితో తెలుగు సినీ పరిశ్రమలో సమసిపోయిన వర్గపోరు మళ్ళీ పురివిప్పింది.
ఇప్పటివరకూ ఆంధ్రా - తెలంగాణ పేరుతో సాగుతున్న గ్రూపు తగాదాలకి కొత్త ట్విస్ట్ ఇది!