ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్క అవకాశంలేక ఖాళీగా ఉన్న కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండు కోరికలను బయటపెట్టింది. అందులో ఓ కోరిక ఏమిటంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయాలని, ఆ పాట ఆ సినిమా హిట్టుకు ముఖ్యకారణం కావాలని కోరుకుంటొంది. అంటే బాలీవుడ్‌లో కత్రినాకైఫ్‌లాగా అన్నమాట. ఇక రెండో కోరిక ఏమిటంటే... లోపల క్రూరత్వం నిండి బయటకు మాత్రం అమాయకంగా కనిపించే క్రూరమైన విలన్ పాత్రను చేయాలనే కోరికను ఆమె బయటపెట్టింది. మరి ఆమె కోరిక మేరకు ఎవరైనా దర్శకనిర్మాతలు అలాంటి పాత్రలతో ముందుకు వస్తే డేట్స్ ఇవ్వడానికి కాజల్ సిద్దమట...!