త్వరలో పూరీజగన్నాథ్ ఓ కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. భారత మాజీ ప్రదాని దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేసే బాద్యతను పూరీ చేతిలో పెట్టారు. గతంలో ‘యువరాజు, అప్పు’ చిత్రాల ద్వారా పూరీ కన్నడిగులకు బాగా పరిచయమే. ఇక ముఖ్యమైన వ్యక్తుల వారసులను తెరంగేట్రం చేయడం కూడా పూరీకి కొత్తేమీ కాదు. గతంలో ఆయన ‘అప్పు’ చిత్రం ద్వారా పునీత్‌రాజ్‌కుమార్‌ను, ‘చిరుత’ చిత్రం ద్వారా రామ్‌చరణ్‌ను తెరంగేట్రం చేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మితో ‘జ్యోతిలక్ష్మి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరీ ఈచిత్రం పూర్తయిన వెంటనే కన్నడ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు.
Advertisement
CJ Advs