Advertisement
Google Ads BL

'లయన్' సినిమా రిలీజ్ డేట్ ఖరారైందా..!


'లెజెండ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొలిసారిగా త్రిష, బాలకృష్ణ సరసన నటిస్తోంది. మొదట ఈ చిత్రం ఆడియో వేడుక శిల్పకళావేదికలో మార్చి 28 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించేందుకు ఆడియో రిలీజ్ ను ఏప్రిల్ 9 కి వాయిదా వేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'లెజెండ్' తరువాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి 'లయన్' సినిమా ఆ అంచనాల్ని ఏమేరకు రీచ్ అవుతుందో వేచిచూడాల్సిందే..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs