దర్శకుడు గుణశేఖర్ తన తాజా చిత్రం ‘రుద్రమదేవి’కి క్రేజ్ తేవడానికి ఏ అవకాశమూ వదులుకోవడం లేదు. ఆడియో ఫంక్షన్‌ని సైతం విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు. వేడుక జరిగే వేదికను సైతం ఇప్పటివరకు ఎప్పుడు జరగని చోట ప్లాన్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరంగల్ కోటలో ఆడియోను విడుదల చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకను ఏప్రిల్ 8వ తేదీన జరపాలని ఆయన అనుకుంటున్నాడట. ఈవేడుకకు సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.