బాలయ్య మెచ్చుకుంటే ఇక హిట్టే...!
తెలుగులో ‘వారాహి చలన చిత్రం’ బేనర్‌కు మంచి పేరుంది. భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు ఈ బేనర్‌లో వచ్చే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయనే గుడ్‌విల్ సాధించింది ఈ బేనర్. ఈ బేనర్ అధినేత సాయికొర్రపాటికి హీరో బాలకృష్ణకు కూడా వ్యక్తిగతంగా మంచి అనుబంధంతో పాటు బాలయ్యకు ముందుకు తమ చిత్రాలను స్పెషల్ షోలు వేయడం కూడా ఈ బేనర్ అధినేత సాయి కొర్రపాటికి సెంటిమెంట్‌గా మారింది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. ఆయన స్పెషల్ షో వేసిన తర్వాత బాలయ్య ఆ సినిమాను మెచ్చుకున్నాడంటే ఇక ఖచ్చితంగా ఆ చిత్రం హిట్టే అనే సెంటిమెంట్ కూడా సాయికొర్రపాటికి ఉంది. తాజాగా ఆయన నిర్మిస్తున్న ‘తుంగభద్ర’ చిత్రాన్ని కూడా బాలయ్యకు స్పెషల్ షో వేసి చూపించారు. ఈ చిత్రం అందరికీ ఆకట్టుకునేలా ఉందని బాలయ్య కాంప్లిమెంట్ ఇవ్వడంతో సాయి నమ్మకం మరింత బలపడిరది. కాగా ‘తుంగభద్ర’ చిత్రం ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads