‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకకు దాసరిని ఎందుకు పిలిచారు? ఎవరు పిలిచారు? అనేది మాత్రం మెగాభిమానులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇందులో అల్లుఅరవింద్ జోక్యం ఏమైనా ఉందా? అనే కోణంలో మెగాభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్, బన్నీలపై పొగడ్తల వర్షం కురిపించిన దాసరి మెగాస్టార్ చిరంజీవి పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు. చేతికి మైకు దొరికితే చాలు ప్రసంగాలు దంచడం దాసరి నైజం. అయన దర్శకునిగా లెజెండ్ అయి ఉండవచ్చు. కానీ తనకు తానే గొప్ప అని చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. ఈ వేడుకలో దాసరి ప్రసంగిస్తుండగా అభిమానులు ఆయన్ను కాస్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. అలాగని అభిమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం సరికాదు. వేదికపై దాసరి ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు గోల చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి ఆడియో వేడుకల్లో మీ అభిమానం ప్రదర్శించడానికి ఆసక్తి చూపుతున్నారే తప్ప.. మాలాంటి పెద్దలు ( ఆయనకు ఆయనే ఓపెద్దగా చెప్పుకున్నాడు) మాటలు వినే ఓపిక మీకు లేదు. ఇలా అయితే మాబోటివారు రావడం దండగ అంటూ మాట్లాడాడు. ‘మాబోటి వారు’ అంటే ఆయన అంతరార్ధం ఏమిటి? పోనీ బన్నీగానీ, ఇతర ప్రముఖులు గానీ, ఆడియో వేడుకకు విచ్చేసిన పెద్దలు గానీ, చివరకు త్రివిక్రమ్ వంటి వారు కూడా ఫ్యాన్స్‌ను ఎందుకు గోల చేయకుండా ఆపలేదు? నిశ్శబ్దంగా ఉండమని కనీసం ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? అసలు ఈ వేడుకలో బన్నీ తప్ప మిగిలిన మెగాహీరోలు, నిన్న మొన్న ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్ వంటి వారు ఎందుకు హాజరుకాలేదు? ఇలా అనేక అనుమానాలను మెగాభిమానులు వెలిబుచ్చుతున్నారు.