టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సంఘటనలో ఉపాసన మాట్లాడిన మాటలు వింటుంటే ఆమె ప్రెగ్నెంట్ అనే సందేహాలు కలుగుతున్నాయి. హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా హైదరాబాద్ వాసులకు శిక్షణ ఇచ్చేందుకు సిటీలో దిగారు. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న ఉపాసన మాట్లాడుతూ 'అటు ప్రీ ప్రెగ్నెన్సీ, ఇటు పోస్ట్ ప్రెగ్నెన్సీలో పెరిగే బరువు గురించి నాకు చాలా సందేహాలు ఉండేవి. కానీ రమోనాను కలిసిన తర్వాత అవన్నీ పోయాయి' అని చెప్పింది. దీంతో ఉపాసన గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాఫ్యామిలీ ఈ విషయంపై అఫీషియల్ గా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.