Advertisement
Google Ads BL

తారక్‌ వస్తాడా? రాడా...?


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం ‘లయన్‌’. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక ఏప్రిల్‌ 9వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగనుంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నాడు. ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీప్రముఖులు, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. అయితే ఈ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తారా? లేదా? ఆహ్వానిస్తే ఆయన వస్తాడా? అనే విషయం ఇంకా ఫైనల్‌ కాలేదు. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ వేడుకకు హాజరయ్యే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో పలు వార్తలు ప్రచారంలోకి వస్తూ అందరినీ ఆసక్తికి గురిచేస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs