Advertisement

మహేష్‌ బాటలో చరణ్‌...!


టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు మద్య ఒక్క విషయంలో మాత్రం మంచి పోలిక ఉంది. మొదటి నుండి మహేష్‌కు తన తండ్రి నటించిన చిత్రాలే కాదు...మరో హీరో నటించిన పాత చిత్రాలను కూడా రీమేక్‌ చేయడం ఇష్టంలేదు. ఆయన ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. రీమేక్‌ పేరిట పాత క్లాసిక్స్‌ను చెడగొట్టడం తనకు నచ్చదని చెప్పాడు. ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు రామ్‌చరణ్‌. ‘జంజీర్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేసి చెడ్డపేరు తెచ్చుకున్న తర్వాత ఇక పాత క్లాసిక్స్‌ జోలికే కాదు.. రీమేక్‌ చిత్రాలను కూడా చేయకూడదని రామ్‌చరణ్‌ డిసైడ్‌ అయ్యాడు. రీసెంట్‌గా రామ్‌చరణ్‌ కన్నడలో విడుదలై సంచలనం సృష్టిస్తోన్న ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి’ చిత్రాన్ని చూశాడు. ఈ చిత్రం చూసిన తర్వాత ఆయన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేను ఈమధ్యకాలంలో చూసిన చిత్రాల్లో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి’ ఓ బెస్ట్‌ ఫిల్మ్‌. అలాగే ఈ చిత్రం నన్ను చేయమని ఆఫర్‌ కూడా వచ్చింది. కానీ నేను రిజెక్ట్‌ చేశాను అన్నాడు.‘జంజీర్‌’ రీమేక్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. అదో మిస్టెక్‌. ఒరిజినల్‌లో చిత్రం అదిరిపోయేలా ఉంటే నేను అలాంటి రీమేక్‌లు చేయడానికి ఇష్టపడను అంటూ తన అభిప్రాయాన్ని తెలియజెప్పాడు...! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement