Advertisement
Google Ads BL

లారెన్స్‌ ఆశలన్నీ ‘కాంచన2’పైనే!


కొరియోగ్రాఫర్‌ నుండి నటునిగా, ఆ తర్వాత డైరెక్టర్‌గా మారిన రాఘవలారెన్స్‌ ‘ముని’ చిత్రం తీశాడు. ఈ చిత్రం టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ‘ముని’కి సీక్వెల్‌గా ‘కాంచన’ తీశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. కాగా ఆయన ఇప్పుడు ‘కాంచన2’ను తీస్తున్నాడు. ఈ చిత్రంలో గ్రాఫిక్‌ వర్క్‌ ఎక్కువగా ఉండటంతో షూటింగ్‌ లేటయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆయన తెలుగులో ‘గంగ’ పేరుతో విడుదల చేయాలని భావించాడు. కానీ చివరకు ‘కాంచన2’గానే విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ చిత్రంలో తాప్సి నటిస్తుండగా కీలకమైన పాత్రలో నిత్యామీనన్‌ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో లారెన్స్‌ మహిళ వేషంలో నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నాడట. ఒక మహిళ జీవితంలోని నాలుగు దశలను (15ఏళ్లు, 25ఏళ్లు, 45ఏళ్లు, 60ఏళ్ల) గెటప్స్‌లో లారెన్స్‌ కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సురేష్‌ విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రానికి మొత్తం ఐదుమంది సంగీత దర్శకులు పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఏప్రిల్‌ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs